యూపీకి దత్తపుత్రులు అవసరం లేదు : ప‌్రియాంకా గాంధీFri,February 17, 2017 05:25 PM
యూపీకి దత్తపుత్రులు అవసరం లేదు : ప‌్రియాంకా గాంధీ

రాయ్‌బ‌రేలి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌ని ప్రియాంకా గాంధీ ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు. ఇవాళ రాయ్‌బ‌రేలిలో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అండ‌గా మీరుండాలని ఆమె ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అన్నారు. రాహుల్ గాంధీతో క‌లిసి వేదిక‌ను పంచుకున్న ఆమె ప్ర‌ధాని మోదీ వ్య‌వ‌హార‌శైలిని విమ‌ర్శించారు. యూపీ తనను ద‌త్త‌త తీసుకున్న‌దని మోదీ అంటున్నారు, కానీ యూపీకి బ‌య‌టివాళ్లు ఎవ‌రూ అవ‌స‌రం లేద‌ని ప్రియాంకా అన్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న హింస‌కు వ్య‌తిరేక‌మ‌ని మోదీ అంటున్నారు, కానీ బ్యాంకుల ముందు మ‌హిళ‌లు క్యూలో నిల‌బ‌డేలా చేస్తున్నార‌ని అన్నారు.

మీడియాకు మోదీ అంటే భ‌యం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇవాళ రాయ‌బ‌రేలిలో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు. ప్రియాంకా గాంధీ కూడా ఆ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ప్ర‌ధాని మోదీ చెబుతున్న అబ‌ద్ధాల‌ను మీడియా బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోతున్న‌ద‌ని, ప్ర‌ధాని అంటే మీడియా భ‌య‌ప‌డుతున్న‌ద‌ని రాహుల్ విమ‌ర్శించారు. ఎక్క‌డికి వెళ్లినా మోదీ వాగ్ధానాలు చేస్తున్నార‌ని, కానీ ఏమీ చేయ‌డం లేద‌న్నారు. బ‌నార‌స్‌ను శుభ్రం చేస్తాన‌న్నారు, కానీ అది ఇంత వ‌ర‌కు జ‌ర‌గ‌లేద‌న్నారు. రైతుల రుణాల‌ను మాఫీ చేయాలంటే ప్ర‌ధానికి రెండు నిమిషాల స‌మ‌యం కూడా ప‌ట్ట‌ద‌ని, కానీ యూపీలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌చ్చేంత‌ వ‌ర‌కు ప్ర‌ధాని ఎదురుచూడాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్నారు. రుణాలు, విద్యుత్తు బ‌కాయిల మాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నార‌ని రాహుల్ అన్నారు. కాంగ్రెస్‌-ఎస్పీ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డితే రైతుల రుణాల‌ను మాఫీ చ‌స్తామ‌ని కాంగ్రెస్ నేత హామీ ఇచ్చారు. విజ‌య్ మాల్యా రుణాల‌ను మాఫీ చేసిన మోదీ రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ఎందుకు నిరాక‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

1422
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS