రాజాజీ హాలు దగ్గర తొక్కిసలాట.. ఇద్దరు మృతి

Wed,August 8, 2018 03:48 PM

Stampede at Rajaji Hall kills 2 and injured many

చెన్నై: కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన చెన్నైలోని రాజాజీ హాలు దగ్గర తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. కరుణానిధిని కడసారి చూసేందుకు వేలాది మంది రాజాజీ హాలుకు తరలివస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన భద్రతను కాస్త సడలించి మెరీనా బీచ్ దగ్గరకు పంపించారు. దీంతో ఇక్కడ పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భం ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఇద్దరు అభిమానులు మృత్యువాత పడ్డారు. గాయపడిన వాళ్లను నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభిమానులు సహనంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా స్టాలిన్ కోరారు. వేల మంది తరలి రావడంతోపాటు ఇదే సమయంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు వీవీఐపీలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. మరి కాసేపట్లో కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మెరీనా బీచ్‌లోని అన్నా స్కేర్‌లో కరుణానిధిని ఖననం చేయనున్నారు.1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS