ప్రేమించలేదని.. 38 కత్తిపోట్లు

Sat,September 15, 2018 01:21 PM

Stalker stabs woman more than 38 times kills her in Indore

ఇండోర్ : ఓ యువతి తనను ప్రేమించడం లేదని.. ఆమెను 38 సార్లు కత్తితో పొడిచి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కమలేశ్ సాహూ, సుప్రియా జైన్ అనే ఇద్దరూ పన్నెండో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అయితే ఆరేండ్ల క్రితం సుప్రియాకు కమలేశ్ ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. తనను ప్రేమను అంగీకరించాలని కమలేశ్.. తన చేతిని కూడా కోసుకున్నాడు. కమలేశ్ ప్రపోజ్‌ను సుప్రియా సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం సుప్రియా.. ఇండోర్ వెళ్లిపోయింది.

ఈ క్రమంలో ఆర్నేళ్ల కింద ఫేస్‌బుక్ ద్వారా సుప్రియా ఎక్కడ ఉంటుందో కమలేశ్ కనుగొన్నాడు. ఇండోర్‌లో సుప్రియా ఉంటున్నట్లు గుర్తించిన కమలేశ్ అక్కడికి చేరుకున్నాడు. సుప్రియా తన ఆఫీస్ స్నేహితులతో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన కమలేశ్‌కు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను ప్రేమించకుండా మరొకరితో సన్నిహితంగా ఉంటుందని గ్రహించిన కమలేశ్.. ఆమెను అంతమొందించాలని కుట్ర చేశాడు.

గురువారం రాత్రి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సుప్రియాపై కత్తితో దాడి చేశాడు. ముఖంతో పాటు ఇతర శరీర భాగాలపై 38 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపాడు. రక్తపు మడుగులో ఉన్న సుప్రియాపై కూర్చోని గట్టిగా అరిచాడు కమలేశ్. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు కమలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుప్రియాను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక కమలేశ్‌కు రిమాండ్ విధించి జైలుకు తరలించారు పోలీసులు.

9229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles