శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి సాగర్‌కు నీరు విడుదల

Sun,August 19, 2018 07:07 PM

srisailam dam 6 gates opened and water left to nagarjuna sagar dam

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2,64,773 క్యూసెక్కులు కాగా ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 2,64,773 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం 6 గేట్లు ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 881.90 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 198.36 టీఎంసీలుగా ఉండగా.. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా ఉంది.

1927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS