శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి బంద్

Tue,January 22, 2019 02:44 PM

జమ్ముకశ్మీర్: తీవ్ర మంచు తుఫాను కారణంగా శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని మూసేశారు. జవహర్ సొరంగమార్గానికి ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మార్గంలో చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది, యంత్రాలు మంచును తొలగించేందుకు నిమగ్నమయ్యాయి. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఉదంపూర్ జిల్లా కగోట్ వద్ద గల రాంన‌గ‌ర్‌-ఉదంపూర్ రహదారి బంద్ అయింది.

505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles