దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Thu,March 21, 2019 01:12 PM

special arrangements to specially-abled voters in Karnataka

బెంగళూరు: దివ్యాంగ ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కర్ణాటక పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 18న రెండవ, ఏప్రిల్‌ 23న మూడవ దశలో పోలింగ్‌ నిర్వహణ జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని ఓటర్లలో 4,03,907 మంది దివ్యాంగుల అవసరాలను గుర్తించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. వీరి సౌకర్యం నిమిత్తం 35 వేల వీల్‌ చైర్లు, 52 వేల మ్యాగ్నిఫైడ్‌ కళ్లద్దాలు, 2213 మంది మూగ సైగల అనువాదకులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు పీడబ్ల్యూడీ ఓటర్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసే పోలింగ్‌ బూత్‌ల్లోనే వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles