పూలే, అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

Mon,April 16, 2018 01:42 PM

Speaker Madhusudanachary and Swamy Goud participated in Ambedkar birth anniversary

న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిబా పూలే, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతిబా పూలే, బీఆర్ అంబేడ్కర్ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

దేశానికి దశ, దిశ చూపారు : స్పీకర్
అప్పటి సమాజంతో పోలిస్తే ఇప్పటి సమాజం కొంత మెరుగుపడిందన్నారు స్పీకర్ మధుసూదనాచారి. అంబేడ్కర్, పూలేలు ప్రతికూల పరిస్థితులను ఒడిసిపట్టుకొని దేశానికి దశ, దిశను చూపారు. మహాత్మలను స్మరించడం కాదు.. వారి అడుగుజాడలలో నడిచి విజయాలను అందుకోవాలని సూచించారు. అంబేడ్కర్, పూలేలు ఎలాంటి సదుపాయాలను వాడుకోకుండా ప్రతికూల పరిస్థితుల్లో పోరాడి ఆదర్శంగా నిలిచారని స్పీకర్ పేర్కొన్నారు.

ఏప్రిల్ మాసం మహనీయులు జన్మించిన మాసం : స్వామిగౌడ్
మన భాష, మన దేశాన్ని, జన్మభూమిని ఎప్పటికీ మరవద్దు అని స్వామిగౌడ్ కోరారు. ఏప్రిల్ మాసం మహనీయులు జన్మించిన మాసం అని పేర్కొన్నారు. 170 సంవత్సరాల క్రితమే అసమానతలను గుర్తించారు అని తెలిపారు. ఎక్కడ చదువు ఉండదో అక్కడే అసమానతలు ఉంటాయని పూలే చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అన్ని వర్గాల వారు గురువుగా గుర్తిస్తారు. కానీ మహాత్మా జ్యోతిబా పూలేను అంబేడ్కర్ గురువుగా స్వీకరించారని వెల్లడించారు. జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగితే అంబేడ్కర్, పూలేలుగా ఎదగొచ్చు అని స్వామిగౌడ్ చెప్పారు.

1259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles