బీజేపీ అరాచకాలకు చరమగీతం పాడాలి : అఖిలేష్

Sat,January 12, 2019 01:31 PM

SP Chief Akhilesh Yadav fire on BJP Politics in Country

లక్నో : ఈ దేశంలో పేదలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు లెక్కే లేదు. దేశంలో భయానక, విద్వేషపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ అరాచకాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై లక్నోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.

పొత్తుకు అంగీకరించిన మాయావతికి ధన్యవాదాలు తెలిపారు అఖిలేష్ యాదవ్. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ ధ్వంసం చేసిందన్నారు. ఉత్తరప్రదేశ్ లో కులాలు, మతాల వారీగా లెక్కలు వేసి ఎన్ కౌంటర్ లో చంపేస్తున్నారు. ఎన్ కౌంటర్ల పేరుతో నిమ్న కులాలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతోన్మాదం పెరిగిపోయిందన్నారు. బీజేపీ మతోన్మాదంతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోందని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే పని చేస్తుందన్నారు. కార్పొరేట్ల కోసం వేల కోట్లు మాఫీ చేస్తోందని మండిపడ్డారు.

బీజేపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించడానికే ఎస్పీ, బీఎస్పీ కలుస్తున్నాయని స్పష్టం చేశారు. బీజేపీ ద్వారా జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలను అంతం చేయడానికే తమ పొత్తు అని తేల్చిచెప్పారు. బీజేపీ అహంకారాన్ని అణచడానికి ఎస్పీ, బీఎస్పీ కలయిక చరిత్రాత్మక అవసరం అన్నారు. ఇవాళ్టి నుంచి ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి మాయావతి గౌరవమే తన గౌరవమని అఖిలేష్ చెప్పారు. పరస్పర సహకారంతో పని చేసి బీజేపీ ఓటమికి మనం నాంది పలకాలని కోరారు. ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ఎన్నో కుయుక్తులు పన్నే అవకాశం ఉందన్నారు. వ్యక్తిగతంగా తమపై కక్ష కట్టినా తమ పోరాటం ఆపమని తేల్చిచెప్పారు. కార్యకర్తలంతా బీజేపీ కుయుక్తులకు లోనుకాకుండా కలిసి పని చేయాలని అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles