బీజేపీకి బుద్ధి చెప్తాం.. ఆ ఇద్దరికి నిద్రలేని రాత్రులే : మాయావతి

Sat,January 12, 2019 01:14 PM

SP and BSP will lead to a new political revolution in the country says Mayawati

లక్నో : కొత్త సంవత్సరంలో దేశంలో సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలుకుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆటలు ఇక సాగవు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. బీఎస్పీ, ఎస్పీ పొత్తుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాయావతి మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని మాయావతి వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ సంపూర్ణ విజయం సాధించాయని గుర్తు చేశారు. ఉప ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నామని చెప్పారు. మోదీ పాలనపై రైతులు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

1975లో కాంగ్రెస్ హయాంలో అధికార అత్యవసర స్థితి ప్రకటించారు. ఇప్పుడు దేశంలో అప్రకటిత అత్యవసర స్థితి కొనసాగుతోందన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే తరహా పార్టీలు అని దుయ్యబట్టారు. రక్షణ ఒప్పందాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒకే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయి.

మోదీ, అమిత్ షా ద్వయానికి ఈ మీడియా సమావేశం నిద్ర లేకుండా చేస్తోందన్నారు. మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అని చెప్పారు. రామమందిరం పేరుతో మళ్లీ ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ఆటలు సాగవు అని తేల్చిచెప్పారు. బీఎస్పీ 38, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో రెండు స్థానాలను కాంగ్రెస్ కు వదిలేశాం. ఇంకో రెండు స్థానాలను ఇతర పార్టీలకు వదిలేశామని మాయవతి పేర్కొన్నారు. 2019 ఎన్నికల తర్వాత కూడా మా భాగస్వామ్యం కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార దాడులను ఉసిగొల్పుతోందన్నారు మాయావతి.

1784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles