3 రోజుల ముందే.. వ‌ర్షాకాలం వ‌చ్చేసింది..

Tue,May 29, 2018 12:35 PM

south west monsoon hits Kerala, 3 days in advance, says IMD

న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది మూడు రోజులు ముందగానే రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో నాలుగు నెలల వర్షాల సీజన్ ప్రారంభమైందని ఐఎండీ పేర్కొన్నది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ ఒకటవ తేదీన నైరుతీ రుతపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. మరో నెలన్నర రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే వర్షపాతం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. వాతావరణాన్ని అంచనా వేసే స్కైమెట్ అనే ప్రైవేటు సంస్థ నైరుతీ రుతుపవనాలు సోమవారమే ప్రవేశించినట్లు పేర్కొన్నది.

ఒకవేళ మే 10వ తేదీ తర్వాత కేరళలోని 14 ప్రాంతాల్లో వరుసగా రెండు రోజుల పాటు 60 శాతం కన్న ఎక్కువ వర్షం నమోదు అయితే, ఆ లెక్క ప్రకారం దేశంలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ వెల్లడించింది. మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లామ్, అలప్పుజా, కొట్టాయం, కోచి, త్రిసుర్, కోజికోడ్, తలసరీ, కన్నూరు, కుడులు, మంగలూర్ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా 2.5ఎంఎం వర్షం నమోదు అయ్యింది. రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించేందుకు దీన్నే కొలమానంగా భావిస్తారు. అంతేకాకుండా పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులు సముద్రం మట్టం కంటే సుమారు 15వేల ఫీట్ల ఎత్తులో ఉండాలి. దీన్ని బట్టి కూడా రుతుపవనాల ఆగమనాన్ని అంచనా వేస్తారు.

4199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles