ఓటేసిన గంగూలీ, భజ్జీ

Sun,May 19, 2019 04:47 PM

Sourav Ganguly cast his vote at a polling booth in Barisha Janakalyan Vidyapith

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం దేశవ్యాప్తంగా 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వ‌హించిన‌ పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ కోల్‌కతాలోని బారిష జనకల్యాణ్‌ విద్యాపీఠ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. అలాగే మరో సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె ప్రజలకు అభివాదం చేశారు. దేశవ్యాప్తంగా ఆయా రంగాల ప్రముఖులు, శతాధిక వృద్ధులు, నూతన వధూవరులు,యువ‌తీయువ‌కులు ఉత్సాహంగా ఓటు వేశారు.
862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles