గాంధీ విగ్ర‌హం ముందు సోనియా, రాహుల్ ధ‌ర్నా

Thu,July 11, 2019 11:14 AM

Sonia, Rahul participate in protest at Parliament over Goa issue

హైద‌రాబాద్: పార్ల‌మెంట్‌లో గాంధీ విగ్ర‌హం ముందు ఇవాళ సోనియా, రాహుల్‌ గాంధీలు ధ‌ర్నా చేశారు. క‌ర్నాట‌క‌, గోవా అంశాల‌పై బీజేపీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు రాహుల్ చెప్పారు. క‌ర్నాట‌క‌, గోవా రాష్ట్రాల్లో బీజేపీ అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేస్తున్న‌ద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెసేత‌ర పార్టీలు కూడా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హం ముందు ధ‌ర్నా చేప‌ట్టాయి. టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఎం పార్టీ ఎంపీలు ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించాలంటూ నినాదాలు చేశారు. గోవా అసెంబ్లీ ప‌రిస్థితిపై ఇవాళ చ‌ర్చించాలంటూ లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌ది మంది ఎమ్మెల్యేలు బుధ‌వారం బీజేపీలో చేరారు. దీంతో గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్య అయిదుకు ప‌డిపోయింది.

1243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles