సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా దూరం

Sat,August 4, 2018 11:07 AM

Sonia Gandhi unwell, not to attend CWC meeting

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరుకావడం లేదు. అనారోగ్యం కారణంగా ఆమె ఈ భేటీకి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. సమావేశానికి హాజరయ్యారు. అసోంలో సిటిజ‌న్స్ చార్ట‌ర్ నుంచి 40 ల‌క్ష‌ల మంది పౌరుల‌ను తొలిగించిన అంశాన్ని ఈ సమావేశంలో చ‌ర్చించ‌నున్నారు. అసోం ఘ‌ట‌న ప‌ట్ల ఏ విధంగా ముందుకు వెళ్లాల‌న్న వ్యూహాన్ని ర‌చించ‌నున్నారు. ఎన్ఆర్‌సీని అప్‌డేట్ చేయ‌డాన్ని కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది. కానీ ఎన్ఆర్‌సీ నిర్వ‌హించిన ప్ర‌క్రియ‌ను మాత్రం ఆ పార్టీ వ్య‌తిరేకిస్తున్న‌ది. ఈశాన్య రాష్ట్రాల నేత‌లు త‌రుణ్ గ‌గోయ్‌, బిపున్ బోరా, దేబ‌బ‌త్ర సైకియా, గౌర‌వ్ గ‌గోయ్‌, సుస్మితా దేవ్‌లు కూడా హాజ‌ర‌య్యారు.

730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles