గెలుపోటములు సహజం : సోనియా గాంధీ

Thu,August 9, 2018 01:03 PM

Sonia Gandhi on NDA Candidate Harivansh elected as Rajya Sabha Deputy Chairman

న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎన్నికపై యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ స్పందించారు. కొన్ని సార్లు తాము విజయం సాధించాం.. కొన్నిసార్లు తాము ఓడిపోయామని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని చెప్పారు.

అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్.. విపక్షాల అభ్యర్థి బి.కె. హరిప్రసాద్‌పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరివంశ్ నారాయణ్ సింగ్‌కు 122 ఓట్లు.. బి.కె. హరిప్రసాద్‌కు 105 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్‌ఎస్ ఎన్డీయే అభ్యర్థికి ఓటేయగా.. టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసింది.. కాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

2425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS