కాంగ్రెస్‌ ఎంపీలతో సోనియా గాంధీ భేటీ

Wed,July 24, 2019 12:31 PM

sonia gandhi holds meeting with congress loksabha MPs

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ.. తమ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలతో ఇవాళ సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ - జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం విదితమే. దీంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇక కశ్మీర్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ కూడా సొంత పార్టీ సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులతో ఇవే అంశాలపై మధ్యాహ్నం ఒంటి గంటకు చర్చించనున్నారు.

520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles