రాయ్‌బరేలిలో సోనియా పర్యటన

Wed,June 12, 2019 11:01 AM

Sonia Gandhi arrives in Raebareli

హైదరాబాద్ : యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ రాయ్‌బరేలిలో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం సోనియా రాయ్‌బరేలి రావడం ఇదే తొలిసారి. సోనియాతో పాటు ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియాకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాయ్‌బరేలి నుంచి గెలుపొందిన సోనియా.. పార్టీ కార్యకర్తలతో ఇవాళ సమావేశం కానున్నారు. యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కేవలం ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అమేథిలో రాహుల్ గాంధీ ఓటమి పాలుకాగా, రాయ్‌బరేలిలో సోనియా గెలిచారు. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక యూపీ విషయానికి వస్తే బీజేపీ 64, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో గెలుపొందింది.

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles