ఆ బీఎస్‌ఎఫ్ జవాను కొడుకు అనుమానాస్పద మృతి

Fri,January 18, 2019 11:09 AM

Son Of BSF Jawan Who Made Bad Food Videos Found Dead

న్యూఢిల్లీ: జవాన్లకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఫిర్యాదు చేస్తూ బీఎస్‌ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఏడాది క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసిన విషయం గుర్తుందికదా.. క్రమశిక్షణ చర్యలక్రింద అతడిని అధికారులు సర్వీసు నుంచి తొలగించారు. అతడి కొడుకు రోహిత్(22) అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. హర్యానాలోని రివరీలో గల ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్పందిస్తూ.. గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. మృతదేహం మంచంపై పడిఉంది. చేతిలో పిస్టల్ ఉన్నట్లు తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లినట్లు తెలిపారు. సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన ఆరోపణలపై విచారణకు బీఎస్‌ఎఫ్ 2017లో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. సరిహద్దుల్లో కపాలాకాసే తమకు నీళ్ల పప్పు, మాడిపోయిన చాపతీలను ఆహారంగా పెడుతున్నట్లు ఆరోపిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీత వైరల్ కావడంతో కేంద్ర హోంశాఖ, ప్రధాని కార్యాలయం సైతం నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో యాదవ్‌ను ఎల్‌వోసీ నుంచి బదిలీచేశారు. అనంతరం తప్పుడు ఆరోపణలు చేసిన కారణంగా అన్న అంశంపై సర్వీసు నుంచి పూర్తిగా తొలగించారు. కాగా తన ఆరోపణలపై అధికారులు నిజమైన దర్యాప్తు చేపట్టలేదని యాదవ్ పేర్కొన్నాడు.

647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles