టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే కుమారుడి దాడి.. వీడియో

Wed,February 14, 2018 10:36 AM

Son of BJP MLA Pooran Prakash his supporters thrashed a toll employee at Mahuvan toll plaza

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, వారి వారసులు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. బాలదేవ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పూరన్ ప్రకాశ్ కుమారుడు టోల్‌ప్లాజా సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. మహువాన్ టోల్‌ప్లాజా వద్ద బీజేపీ ఎమ్మెల్యే తన కారును ఆపకుండా వేగంగా వెళ్తున్నారు. టోల్ చెల్లించకుండా వెళ్తున్న కారును ఆపేందుకు టోల్‌ప్లాజా సిబ్బంది.. బ్యారియర్‌ను వేశాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఎమ్మెల్యే కుమారుడు, అతని సన్నిహితులు కారు దిగి.. టోల్‌ప్లాజా సిబ్బందిని చితకబాదారు. కారుపై శాసనసభ్యుడు అని రాసి ఉన్న ఎందుకు ఆపుతున్నారని వాగ్వాదానికి దిగారు. టోల్‌ప్లాజా సిబ్బంది ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసినప్పటికీ.. కేసు నమోదు చేసుకోలేదు.2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles