ఆస్తి కోసం తల్లిని హతమార్చిన తనయుడు

Thu,December 20, 2018 03:15 PM

Son kills 77 year old mother for denying him share in property

చెన్నై : నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని ఓ దుర్మార్గపు కుమారుడు కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపాడు. ఈ దారుణ సంఘటన చెన్నైలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నైకి సమీపంలోని కాయరంపేడుకు చెందిన దేవరాజ్ వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. తల్లిని పట్టించుకోవడం లేదు. దీంతో తల్లి ముత్తమ్మ(77) తనకున్న రెండు ఎకరాల పొలాన్ని కూతురు విజయలక్ష్మీ పేరిట రాసిచ్చింది. ఈ క్రమంలో తల్లీకొడుకుల మధ్య గొడవలు జరిగాయి. చివరకు తనకు ఆస్తిలో వాటా కోసం దేవరాజ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణ కోసం ముత్తమ్మ, విజయలక్ష్మీ బుధవారం కోర్టుకు వచ్చారు. కోర్టు విచారణ అనంతరం ఎంటీసీ బస్టాండ్ కు చేరుకున్న తల్లీ, సోదరిపై దేవరాజ్ కత్తితో దాడి చేసి వారి గొంతులు కోశాడు. తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సోదరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఘటనాస్థలి నుంచి పారిపోయేందుకు యత్నించిన దేవరాజ్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles