మా పెళ్లికి గిప్టులు వ‌ద్దు.. మోదీకి ఓటేయండి చాలు..!

Fri,January 4, 2019 07:33 PM

ఇది భార‌త‌దేశం. సినిమా సెల‌బ్రిటీల‌ను దేవుళ్లుగా కొలిచే దేశం ఇది. ఆవు మూత్రాన్ని కొన్ని ర‌కాల వ్యాధులు న‌యం చేసే ఔష‌ధంగా భావించే దేశం ఇది. అలాగే త‌మ‌కు న‌చ్చిన పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌ను కూడా త‌మ‌కు న‌చ్చిన విధంగా ప్ర‌మోట్ చేసుకుంటున్న దేశం ఇది. కానీ.. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అంత‌కంటే ఎక్కువ పాపులారిటీ ఉందేమో అనిపిస్తుంది ఈ పెళ్లి కార్డులు చూస్తే.


ఇప్పుడు ఇంత సోది ఎందుకంటే.. గ‌త కొన్ని రోజులుగా కొన్ని పెళ్లి కార్డులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఎందుక‌వి వైర‌ల్‌గా మారాయంటే.. వాటికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే.. బందుమిత్రుల అభినంద‌న‌ల‌తో అని రాసే ద‌గ్గ‌ర‌.. వీళ్లు ఏం రాశారో తెలుసా? మా పెళ్లికి గిఫ్టులు గ‌ట్రా ఏమీ వ‌ద్దు. మీరు 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోదీకి ఓటు వేస్తే చాలు.. అదే మాకు ప‌దివేలు అన్న‌ట్టుగా ప్రింట్ చేయించారు. సూర‌త్, మంగ‌ళూరుకు చెందిన కొన్ని జంట‌లు ఇలా.. ఇన్విటేష‌న్ కార్డుల‌లో రాయించారు.

ఇంకో ఇన్విటేష‌న్ కార్డులో అయితే.. ఇంకో అడుగు ముందుకేసి.. అత‌డి పెళ్లి ప‌త్రిక‌లోనే మోదీ నాలుగున్న‌రేళ్ల‌లో ఏం చేశారు. దేశాన్ని ఏవిధంగా అభివృద్ధి చేశారు.. అన్నీ పూస‌గుచ్చిన‌ట్టు అచ్చేయించాడు. మ‌నం మోదీకి ఓటేస్తేనే.. ఆయ‌న మ‌న‌ల్ని మంచిగా చూసుకుంటారు.. అంటూ త‌న పెళ్లి ప‌త్రిక‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు ఆ పెళ్లి కొడుకు. అయితే.. ఇవ‌న్నీ నిజ‌మైన పెళ్లి ప‌త్రిక‌లా.. లేక ఏదో స‌ర‌దాగా త‌యారు చేసిన పెళ్లి ప‌త్రిక‌లా.. లేక మోదీ కోసం కావాలని చేయించిన పెళ్లి ప‌త్రిక‌లా అంటే.. ఆ ప్ర‌శ్న‌ల‌కు దేవుడే స‌మాధానం చెప్పాలి.

6309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles