పాక్ కాల్పులు : జవాను మృతిSat,August 12, 2017 08:31 PM

పాక్ కాల్పులు : జవాను మృతి

జమ్మూకశ్మీర్ : పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కేజీ సెక్టార్‌లో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో పాక్ కాల్పులకు పాల్పడింది. పాక్ కాల్పుల్లో 42 ఏళ్ల జవాను మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ ను నజీబ్ సుబేదార్ జగ్రాం సింగ్ తోమర్ గా గుర్తించారు. పాక్ ఆర్మీ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.

జమ్మూకశ్మీర్ లోని మేంధార్ సెక్టార్ లో శనివారం ఉదయం పాక్ కాల్పులకు పాల్పడిన విషయం విదితమే. పాక్ కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని రఖీయా బేగమ్ గా పోలీసులు గుర్తించారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS