హైవేపై వందలకొద్దీ వాహనాలు..మంచు తొలగిస్తున్న సిబ్బంది

Wed,January 23, 2019 02:52 PM

Snow clearance is underway along Jammu-srinagar highway


జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో ఓ వైపు వర్షాలు..మరోవైపు కుండబోత మంచు వర్షంతో శ్రీనగర్-జమ్మూ నేషనల్ హైవేను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవే పరిధిలోని పలు ప్రాంతాలను మంచు కప్పేసింది. దీంతో హైవే వెంట 270 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కశ్మీర్ గేట్ వేలోని జవహర్ టన్నెల్ వెంబడి భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం రోడ్లపై భారీగా పేరుకుపోయిన మంచును తొలగించే పనిని కొనసాగిస్తోంది.

జవహర్ టన్నెల్‌కు రెండువైపులా మంచు చరియలు విరిగిపడ్డాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) ఆధ్వర్యంలో యంత్రాల సాయంతో రహదారుల పునరుద్దరణ పనులను కొనసాగుతున్నాయని నేషనల్ హైవే ట్రాఫిక్ విభాగం డీఎస్పీ ప్రదీప్ సింగ్ తెలిపారు. రోడ్లపై ఏర్పడిన మంచును తొలగిస్తామని..మధ్యాహ్నానికల్లా హైవే వెంట మార్గమధ్యలో చిక్కుకునిపోయిన వాహనాలను ముందుకు కదిలేందుకు అనుమతిస్తామని వెల్లడించారు.

1578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles