వీవీప్యాట్‌ యంత్రంలో పాము

Tue,April 23, 2019 01:27 PM

Snake inside VVPAT machine holds up polling in Kannur

కేరళ : కన్నౌర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. వీవీప్యాట్‌ యంత్రంలో పాము ఉండడాన్ని గమనించిన పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో కొద్దిసేపు పోలింగ్‌ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మొత్తానికి ఆ పామును వీవీప్యాట్‌ యంత్రం నుంచి బయటకు తీశారు. అనంతరం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కన్నౌర్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీ పీకే శ్రీమతై(సీపీఐ-ఎం-ఎల్డీఎఫ్‌), కే సురేంద్రన్‌(కాంగ్రెస్‌ - యూడీఎఫ్‌), సీకే పద్మనాభన్‌(బీజేపీ-ఎన్డీఏ) పోటీ చేస్తున్నారు.

961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles