బీహార్ సీఎంపైకి చెప్పు విసిరిన వ్యక్తి

Thu,October 11, 2018 02:52 PM

Slipper hurled at Bihar CM Nitish Kumar to protest against Reservation System

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పైకి చెప్పు విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనతాదళ్ యునైటెడ్ యూత్ వింగ్ సమావేశంలో నితీష్ మాట్లాడుతుండగా.. ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో జనతాదళ్‌లో ఈ మధ్యే చేరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. నితీష్ పక్కనే ఉన్నారు. చెప్పు విసిరిన వ్యక్తిని ఔరంగాబాద్‌కు చెందిన చందన్ కుమార్‌గా గుర్తించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లపై అసంతృప్తిగా ఉన్న చందన్.. ఈ పనికి పాల్పడ్డాడు. అతనో అగ్ర కులానికి చెందిన వ్యక్తి కావడం, రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ఉద్యోగం లభించకపోవడంతో తన అసంతృప్తిని ఇలా వెల్లగక్కినట్లు చందన్ చెప్పాడు. అతడు నితీష్‌పైకి చెప్పు విసిరిన వెంటనే జేడీయూ యూత్ కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. పోలీసులు వచ్చి చందన్‌ను విడిపించుకొని వెళ్లారు. సీఎం నితీష్‌పైకి చెప్పు విసరడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2016లోనూ పీకే రాయ్ అనే వ్యక్తి నితీష్‌పైకి చెప్పు విసిరాడు.

1224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS