ఇంటికి తాళం వేశాం.. అనే భ్రమలో ఉన్నారా?..వీడియో

Thu,December 14, 2017 07:02 PM

Skilled female thief breaks locks easily in karnataka

ఇంటికి తాళం వేశాం.. ఇక.. హ్యాపీగా ఊరెళ్లి.. షికారు చేసి వద్దాంలే... అని అనుకుంటున్నారా? అవును బాబు అవును అంటారా? అయితే.. మీరు ఈ వీడియో చూడాల్సిందే. చూసి తీరాల్సిందే. ఎందుకంటే.. ఓ మహిళ ఎంతో సింపుల్‌గా ఇంటి తాళాన్ని విరగ్గొట్టేస్తున్నది. ఏదో అరటిపండు తొక్క వలిచినట్లు... ఇంటి తాళాన్ని పగలగొట్టడం, ఎంత పెద్ద గోడైనా సింపుల్‌గా ఎక్కడంలో ఆ మహిళ సిద్ధ హస్తురాలు.

ఏం కాదు.. మా తలుపులు గట్టిగా ఉంటాయి. తాళం కూడా మంచి ధృడమైంది వాడతాం అంటారా? అయినా మీరు ఈ వీడియోను చూడాల్సిందే. ఎందుకంటే.. ఎటువంటి తాళాలనైనా ఈ మహిళ అవలీలగా పగలగొట్టేస్తుంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రెగ్యులర్‌గా ఈ మహిళ తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని తాళాలు పగులగొట్టి దొంగతనం చేస్తుండేది. అయితే.. ఓసారి ఇలాగే దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఒంటరి మహిళ ఇంత సింపుల్‌గా ఎలా దొంగతనం చేస్తున్నదనే అనుమానంతో ఆ మహిళను పోలీసులు విచారించగా... తన నైపుణ్యాన్ని పోలీసుల ముందు ప్రదర్శించింది. దీంతో అవాక్కవడం పోలీసుల వంతయింది. మీరూ ఈ వీడియో చూసి అవాక్కవండి మరి...

6448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS