చిన్నారిని నరికి చంపి రక్తం తాగిన మేనత్త

Tue,February 12, 2019 01:21 PM

six years old girl killed by mother in law in vizag

విశాఖ : మానసిక వేధింపులు భరించలేని ఓ మహిళ.. చిన్నారిని నరికి చంపి రక్తం తాగింది. ఈ దారుణ సంఘటన విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయుపుట్టులో చోటు చేసుకుంది. వంతాల రస్మో అనే మహిళ.. భర్తకు దూరంగా ఉంటూ.. తన అమ్మగారింట్లో ఉంటుంది. అయితే అత్తాగారింటికి వెళ్లిపోవాలని రస్మో తమ్ముడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి.

దీంతో తమ్ముడి భార్యపై కక్ష పెంచుకున్న వంతాల రస్మో ఇవాళ ఉదయం దారుణానికి పాల్పడింది. తమ్ముడి కుమార్తె(6)ను కట్టెల కోసమని సమీపంలో ఉన్న కొండపైకి తీసుకెళ్లింది. అక్కడ కట్టెలు నరికే కత్తితో చిన్నారిపై అత్యంత దారుణంగా దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత చిన్నారి రక్తాన్ని రస్మో తాగేసింది. ఈ ఘటనను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చిన్నారి తండ్రి ఏడాది క్రితమే మృతి చెందాడు. చిన్నారి తల్లి విలవిలలాడిపోతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles