మ‌న్మోహ‌న్ పాల‌న‌లో ఆరుసార్లు స‌ర్జిక‌ల్ దాడులు..

Thu,May 2, 2019 04:41 PM

Six surgical strikes conducted during Manmohan Singh government, says Congress Party

హైద‌రాబాద్‌: మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఆరు సార్లు స‌ర్జిక‌ల్ దాడులు జ‌రిగాయ‌ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న‌ది. ఆ దాడుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎంపీ రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు. 2008, జూన్ 19వ తేదీన జ‌మ్మూక‌శ్మీర్‌లోని బ‌త్త‌ల్ సెక్టార్‌లో మొద‌టిసారి స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేసిన‌ట్లు శుక్లా తెలిపారు. 2011, సెప్టెంబ‌ర్ ఒక‌ట‌వ తేదీన నీల‌మ్ న‌ది లోయ‌లో రెండ‌వసారి స‌ర్జిక‌ల్ దాడి జ‌రిగింద‌న్నారు. ఆ త‌ర్వాత 2013, జ‌న‌వ‌రి 6వ తేదీన సావ‌న్ ప‌త్రా చెక్‌పోస్ట్ వ‌ద్ద‌, 2013 జూలై 28వ తేదీన న‌జాపిర్ సెక్ట‌ర్‌లో, 2013 ఆగ‌స్టు 6వ తేదీన నీలం వ్యాలీలో, 2014 జ‌న‌వ‌రి 14న స‌ర్జిక‌ల్ దాడులు జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా యూఎన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కాంగ్రెస్ ఈ జాబితా రిలీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

2445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles