రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోండి.. లక్ష ఫైన్ కట్టండి!

Tue,February 12, 2019 12:27 PM

Sit on a corner of the court Supreme Court orders CBI former Interim Director M Nageshwar Rao

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడిన సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వర్‌రావుకు వింత శిక్ష విధించింది సుప్రీంకోర్టు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారిని బదిలీ చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన క్షమాపణను తిరస్కరించింది. అంతేకాదు ఆయనకు ఓ వింత శిక్ష విధించింది. రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోవాలని, రూ.లక్ష జరిమానా కట్టాలని ఆదేశించడం విశేషం. నాకు నచ్చింది చేస్తా అన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇది సహించరానిది. ఈ పని చేసే ముందు కోర్టు అనుమతి అడిగి ఉంటే మిన్ను విరిగి మీద పడేదా? ఇది కోర్టు ధిక్కరణ కాకపోతే మరేంటి అని సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ధిక్కరణకుగాను రూ.లక్ష జరిమానా విధిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కోర్టు ముగిసే వరకు ఓ మూలన కూర్చోవాలని ఆదేశిస్తున్నాం అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను బదిలీ చేయడం తన తప్పేనని నాగేశ్వర్ రావు సోమవారం కోర్టు ముందు అంగీకరించారు. క్షమాపణ కూడా అడిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని అన్నారు.

3924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles