‘సర్కార్’ వివాదానికి తెర..సీన్ల తొలగింపునకు ఓకే..!

Fri,November 9, 2018 10:15 AM

sircar team green signal to remove objectionable scenes

చెన్నై: కోలీవుడ్ హీరో విజ‌య్ న‌టించిన ‘సర్కార్’ పై తమిళనాట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్కార్ సినిమాలో వివాదాస్పద సీన్లు, అభ్యంతరకర డైలాగులున్నాయని, వాటిని తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో స‌ర్కార్ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సీన్లను తొలగించాలని చిత్రయూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే వివాదాస్పద సీన్లను పూర్తిగా తొలగించాలంటే సీబీఎఫ్ సీ ఆమోదం లభించాలి. దీంతో సీన్లను తొలగించేందుకు 7 నుంచి 10 రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

స‌ర్కార్ సినిమాలో మాజీ సీఎం జ‌య‌ల‌లిత‌కు వ్య‌తిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్‌ల పట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చిత్రంలో కొన్ని ప్రభుత్వ ప‌థ‌కాల‌ను కూడా సినిమాలో త‌క్కువ చేసి చూపించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయివెల్లువెత్తుతున్నాయి.

1060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles