పుల్వామాపై నోరుజారిన సిద్ధూ.. కపిల్ శర్మ షో నుంచి ఔట్

Sat,February 16, 2019 08:08 PM

Sidhu fired from kapil sharma show for pulwama comments

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మాజీ క్రికెటర్, ప్రస్తుత రాజకీయనేత నవజోత్‌సింగ్ సిద్ధూ ఎప్పుడూ ముందుంటారు. దేశమంతా వైపు పుల్వామా ఉగ్రఘాతుకంపై మండిపడుతున్నది. ప్రజాగ్రహం సహజంగానే టెర్రరిస్టుల గూడుగా మారిన పాకిస్థాన్‌వైపు మళ్లింది. కానీ ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టెది మరోదారి కదా. సిద్ధూ తనదైన శైలిలో కొందరు ఉగ్రవాదులు చేసినదానికి పొరుగుదేశాన్ని మొత్తంగా నిందించడం సరికాదని కామెంట్ చేశారు. ఈ కామెంట్ సహజంగానే ప్రకంపనలు సృష్టించింది. ఇలా మాట్లాడేవాడు మాకెందుకు అనుకున్నాడో ఏమో కపిల్‌శర్మ తన షో నుంచి ఉన్నపళంగా సిద్ధూను పీకి పారేశారు. సిద్ధూ స్థానంలో హాస్యనటి అర్చనా పూరణ్‌సింగ్‌ను చేర్చుకుని ఇక రాజీ లేదని తలుపులు మూసేశారు. షోలో పడీపడీ తెగనవ్వే సిద్ధూ దీనిపై ఏమనుకుంటున్నడో ఏమో.

2773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles