సిద్ధూ మౌనదీక్ష పూనాడు.. ఎందుకో తెలుసా?

Thu,December 6, 2018 06:01 PM

sidhu almost lost his voice

రాజకీయవేత్తగా మారిన క్రికెటర్, పంజాబ్ డిప్యూటీ సీఎం నవజోత్‌సింగ్ సిద్ధూ ఏది చేసినా కొంచెం అతి ఉంటుంది. దాంతోనే సమస్యల్లో ఇరుక్కుంటారు. టీవీషోల్లో పడీపడీ నవ్వడం, పాకిస్థాన్ సైన్యాధిపతిని కావలించుకోవడం వంటివి అందరికీ తెలిసిందే. ఇటీవల నా కెప్టెన్ ఢిల్లీలో ఉన్న రాహుల్ అని స్టేట్‌మెంట్ ఇస్తే కాంగ్రెస్ అధిష్ఠానం నీ కెప్టెన్ పంజాబ్ సీఎం అమరిందర్ అనేది గుర్తుంచుకో అని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన అతి వల్ల మరోరకం సమస్య వచ్చిపడింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున సిద్ధూ ప్రచారం జరిపేందుకు తెగ ఆయాసపడిపోయారు. పార్టీ జయాపజయాలమ ఆటేమోగానీ ఆయనకు మాత్రం గొంతు పోయిందట. స్వరతంత్రులు దాదాపుగా తెగిపోయాయిట. ఇక గొంతుకు సంపూర్ణ విశ్రాంతి ఇవ్వకపోతే మల్లీ మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని వైద్యులు గట్టిగా హెచ్చరించారు. దాంతో సిద్ధూ మౌనదీక్ష పూని ఇంటిపట్టునే ఉంటున్నారు.

998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS