కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కారుకు ప్రమాదం

Thu,January 10, 2019 04:32 PM

sidharamaiah escapes unhurt in car crash

కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తృటిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బెంగళూరు నుంచి మైసూరుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఆయన వాహనాల బారును వెనుక నుంచి వచ్చిన ఓ కారు గుద్దేసింది. ఈ ఘటన దరిమిలా కాన్వాయ్‌లోని ఐదు సుమోలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఐదు సుమోలకు తీవ్రనష్టం వాటిల్లింది. ప్రమాదంలో సిద్ధరామయ్యతో సహా అందరూ పాణాపాయం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. కానీ కాన్వాయ్‌లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ మారిగౌడ ఈ ఘటన కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గుండెపోటు రావడం వల్ల ఆయన మరణించారు.

2240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles