నేను చావాలా.. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుందా !

Mon,April 15, 2019 01:20 PM

Should I die, then you'll be satisfied, says Jaya Prada on Azam Khans remark

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌య‌ప్ర‌ద‌, ఆజంఖాన్ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే స‌మాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌.. ఆదివారం ఓ ర్యాలీలో ప్ర‌సంగం చేస్తూ.. బీజేపీ నేత జ‌య‌ప్ర‌ద‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఎటువంటి లోదుస్తులు వేసుకుంటుందో త‌న‌కు తెలుస‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై జ‌య‌ప్ర‌ద తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి మాట‌లు మాట్లాడే వారిని ఎన్నుకుంటారా అని ఆమె రాంపూర్ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. ఇలాంటి వారిని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నివ్వ‌కూడద‌న్నారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని జ‌య‌ప్ర‌ద అన్నారు. నేను చావాలా.. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుందా అని జ‌య‌ప్ర‌ద త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా మాట్లాడితే నేను భ‌య‌ప‌డి రాంపూర్ వ‌దిలి పోతావేమో అనుకుంటున్నావు, కానీ వ‌దిలి వెళ్లేది లేదు అని జ‌య‌ప్ర‌ద అన్నారు. ఆజంఖాన్‌ను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నివ్వ‌కూడ‌ద‌ని, ఎందుకంటే ఇలాంటి వాళ్లు గెలిస్తే, ప్ర‌జాస్వామ్యం ఏమౌవుతుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఇలాంటి వాళ్లు గెలిస్తే స‌మాజంలో మ‌హిళ‌ల‌కు చోటుండ‌ద‌న్నారు.



3812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles