బీజేపీకి అసలు సినిమా ముందుందిః శివసేన

Fri,February 2, 2018 12:43 PM

Shiva Sena again takes a jibe at BJP

న్యూఢిల్లీః బీజేపీకి కటీఫ్ చెప్పిన శివసేన ఇప్పుడు ఆ పార్టీపై సెటైర్లు వేస్తున్నది. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికలను ప్రస్తావిస్తూ బీజేపీకి అసలు సినిమా ముందుందని అంటున్నది. గుజరాత్‌లో అత్తెసరు మెజార్టీతో పరువు దక్కించుకున్న బీజేపీ.. రాజస్థాన్‌లో రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికలు ఓ ట్రైలర్ అయితే రాజస్థాన్ ఎన్నికలు ఇంటర్వెల్. 2019లో బీజేపీకి అసలు సినిమా కనిపిస్తుంది. మా తీర్మానంపై వెనుకడుగు వేసేదే లేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. జైట్లీ బడ్జెట్ కేవలం పేపర్‌పై అద్భుతంగా ఉన్నదని, ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వేళ బడ్జెట్ అమలుపై మాట్లాడటం దండగ అని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లోని అజ్మేర్, అల్వార్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వసుంధర రాజె ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే.

1850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles