వాస్తు బాగాలేదని లాటరీలో తగిలిన 6 కోట్ల విలువైన ఫ్లాట్ వదులుకున్నాడు!

Sun,March 24, 2019 02:23 PM

Shiv Sena Worker Gives Up Mumbai Flat Won In Lottery Over Bad Vaastu

ముంబై: వాస్తును బలంగా నమ్మేవాళ్లు చాలా మందే ఉంటారు. అయితే లాటరీలో తగిలిన కోట్ల విలువైన ఫ్లాట్‌ను కేవలం వాస్తు కారణంగా వదులుకున్న వ్యక్తి మాత్రం ఇతడే కావచ్చు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేష్‌కు శివసేన చీఫ్ అయిన వినోద్ షిర్కే అనే వ్యక్తికి మహారాష్ట్ర హౌజింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెచ్‌ఏడీఏ) నిర్వహించిన లాటరీలో రెండు ఖరీదైన ఫ్లాట్లు వచ్చాయి. గతేడాది డిసెంబర్‌లో ఈ ఫ్లాట్లను ఆయన గెలుచుకున్నారు. ఇందులో ఒక ఫ్లాట్ విలువ రూ.4.99 కోట్లు కాగా.. మరో ఫ్లాట్ విలువ రూ.5.8 కోట్లు కావడం విశేషం. ఎంహెచ్‌ఏడీఏ చరిత్రలో ఇవే అత్యంత ఖరీదైన లాటరీ ఫ్లాట్స్. అయితే ఇందులో ఖరీదైన రూ.5.8 కోట్లు విలువైన ఫ్లాట్‌ను వినోద్ వదులుకున్నారని, దీనికి కారణం వాస్తు బాగాలేకపోవడమే అని బీఎంసీ అధికారి ఒకరు చెప్పారు. నాకు రెండు ఫ్లాట్లు వచ్చాయి. ఇందులో ఏదో ఒకదానిపై నేను యాజమాన్య హక్కులను సొంతం చేసుకోవచ్చు. అయితే మా వాస్తు సలహాదారును అడిగిన తర్వాత వీటిలో కొన్ని మార్పులు చేస్తేనే నా రాజకీయ జీవితం బాగుంటుందని చెప్పారు. ఖరీదైన ఫ్లాట్‌కు ఆ మార్పులు చేసే వీల్లేదు. దీంతో దానిని నేను వదులుకున్నా అని వినోద్ చెప్పారు. దీంతో ఆ ఖరీదైన ఫ్లాట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మరో వ్యక్తికి ఎంహెచ్‌ఏడీఏ అధికారులు కేటాయించనున్నారు.

5673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles