మా కోరిక సహజమైనదే : శివసేన

Thu,June 6, 2019 12:40 PM

Shiv Sena Sanjay Raut on claim for Deputy Speaker in Lok Sabha

హైదరాబాద్‌ : లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పోస్టును శివసేన ఆశిస్తుంది. డిప్యూటీ స్పీకర్‌ పోస్టును అడగడం సహజమైన కోరికనే.. ఇది తమ డిమాండ్‌ కాదు అని శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకులు సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు కలిగిన తమ పార్టీకి సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఒకే మంత్రి పదవి కట్టబెట్టడం సరికాదన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పోస్టును బీజూ జనతా దళ్‌కు ఎలా ఇస్తారని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా బీజేడీ పని చేసింది. డిప్యూటీ స్పీకర్‌ పోస్టుకు శివసేన పార్టీ సరైన ప్రాధాన్యం కలిగి ఉందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి జేడీయూకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ పోస్టుకు అహ్లువాలియా, రాధామోహన్‌ సింగ్‌, వీరేంద్ర కుమార్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

1428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles