రాహుల్‌ను మెచ్చుకున్న శివసేనMon,December 18, 2017 12:20 PM
రాహుల్‌ను మెచ్చుకున్న శివసేన

ముంబై : కాంగ్రెస్ అధ్యక్షురాడు రాహుల్ గాంధీపై శివసేన ప్రశంసలు కురిపించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా, రాహుల్ ఒంటరిగా ప్రచారం చేసిన తీరును శివసేన మెచ్చుకున్నది. చాలా కీలకమైన దశలో రాహుల్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారని, ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం ఎంత మాత్రం వ్యర్థం కాదు అని శివసేనకు సంబంధించిన సామ్నా పత్రిక తన వ్యాసంలో వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును రాహుల్‌కు వదిలేయడం మంచిదని ఆ పత్రిక పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ తారాస్థాయికి ఎదిగినా, లేక ఓడినా, అది రాహుల్ ఘనతే అవుతుందని సామ్నా వెల్లడించింది. బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో రాహుల్ ముందకు వెళ్లిన తీరు అసాధారణమని, ఆయన పట్టుదల ఆయన్ను ముందుకు తీసుకువెళ్లుతుందని శివసేన అభిప్రాయపడింది. బీజేపీతో కూటమిగా ఉన్న శివసేన ఇప్పుడు మోదీ వైఖరిని తప్పుపడుతున్నది. గత 6 ఏళ్లలో లేని అభివృద్ధి, గత మూడేళ్లలోనే వచ్చిందా అని శివసేన ప్రశ్నించింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి మూడేళ్లే అయ్యిందా లేక 150 ఏళ్ల స్వాతంత్య్ర పోరాటం గురించి బీజేపీ మరిచిపోయిందా అని శివసేన తన పత్రికలో మోదీపై ఫైరయ్యింది.

990
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS