స‌చిన్‌.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను బాయ్‌కాట్ చేయండి!

Fri,January 4, 2019 04:39 PM

Shiv Sena MP Sanjay Raut asks Sachin Tendulkar to boycott govt programmes

ముంబయి: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ గురువు రమాకాంత్ ఆచ్రేకర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శివసేన పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా ఇప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు సచిన్ హాజరుకావొద్దని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూచించారు. పద్మశ్రీ, ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఆచ్రేకర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గౌరవం ఇవ్వలేదని సంజయ్ వ్యాఖ్యానించారు.

గురువారం దాదర్‌లోని శ్మశాన వాటికలో పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆచ్రేకర్ దహన సంస్కారాలు నిర్వహించారు. 87ఏళ్ల అచ్రేకర్ బుధవారం శివాజీపార్క్‌లోని తన ఇంట్లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

2102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles