సిమ్లా పేరు మారబోతోంది...

Mon,October 22, 2018 06:31 AM

Shimla may get renamed as Shyamala

న్యూఢిల్లీ: దేశంలోని ప్రఖ్యాత నగరాల పేరు మార్పు జాబితాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం సిమ్లా తాజాగా చేరింది. హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరు శ్యామలగా మార్చాలని ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నది. బ్రిటిష్ కాలంనాటి చిహ్నాలను తుడిచిపెట్టడంలో భాగంగా సిమ్లా పేరును మార్చాలన్న హిందూత్వ సంస్థల డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధంచేయడంపాటు పార్టీ అనుబంధ సంఘాలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. ఈ ప్రతిపాదనను కొందరు ఆమోదిస్తుండగా, మరికొందరు తిరస్కరిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేత, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి విపిన్‌సింగ్ పార్మర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చారిత్రక నగరాల పేర్లను కూడా మార్చారని, ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అన్నారు. సిమ్లా పేరు ప్రజలు శ్యామలగా మార్చాలని కోరుకుంటే ఆ ప్రతిపాదనను ఆమోదిస్తామన్నారు.

సిమ్లా పేరు మార్చడంలో ఔచిత్యం ఏమిటి?: కాంగ్రెస్


సిమ్లా పేరు మార్చాలని కోరుకుంటున్న వారి అసలు ఉద్దేశం ఏమిటని హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత హర్‌భజన్‌సింగ్ భజ్జి ప్రశ్నించారు. సిమ్లా పేరు మార్చడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. సిమ్లా చారిత్రక నగరమని, దాని పేరు మారిస్తే స్వభావాన్ని కోల్పోతుందని, అసలు సిమ్లా పేరులో తప్పేముందన్నారు. రాష్ర్టాభివృద్ధిపై దృష్టిపెట్టని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి హాస్యాస్పద అంశాలను తెరపైకి తీసుకొస్తున్నదని మండిపడ్డారు.సిమ్లా అసలు పేరు శ్యామల అని, ఆంగ్లేయుల ఉచ్చారణలో సిమ్లాగా మారిందని, ఆ తర్వాత అది షిమ్లా రూపాంతరం చెందిందని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత అమన్‌పురి తెలిపారు.

3761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles