కేజ్రీవాల్‌ను కలిసిన షీలా దీక్షిత్.. ఆ రెండు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌

Wed,June 12, 2019 06:17 PM

Sheila Dikshit Meets Arvind Kejriwal Weeks After Blame Game

న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ బుధవారం ఆయన నివాసంలో కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాకు ఆప్, కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఢిల్లీలో బీజేపీ క్లీన్‌స్లీప్ చేసింది. రాజధాని నగరం ఢిల్లీలో నీటితో పాటు కరెంట్ కష్టాలు కూడా ప్ర‌జ‌ల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి వచ్చిన ఆమె రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలపై కేజ్రీవాల్‌తో చర్చించారు. విద్యుత్ బిల్లుపై ఫిక్స్‌డ్ చార్జీ వెనక్కి తీసుకోవాలని ఆమె కోరిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు వచ్చే ఎనిమిది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో వీరి భేటికి ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆప్, కాంగ్రెస్ పొత్తు గురించి చర్చించగా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో ఒంటరిగానే పోటీ చేసి పరాజయం పాలయ్యాయి. ఢిల్లీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతుండటంతో రెండు పార్టీలు కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నట్లు సమాచారం.

1474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles