కాంగ్రెస్ టికెట్‌పై శ‌తృఘ్న సిన్హా పోటీ !

Wed,March 20, 2019 04:14 PM

Shatrughan Sinha may contest loksabha polls as congress candidate

హైద‌రాబాద్‌: బీజేపీలో రెబ‌ల్‌గా ఉన్న ఎంపీ శ‌తృఘ్న సిన్హా.. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్‌కు చెందిన ఎంపీ శ‌తృఘ్న‌.. పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేయ‌నున్నారు. పార్టీలో ఉంటూనే ప్ర‌ధాని మోదీ తీరును వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న శ‌తృఘ్న సిన్హా.. ఈసారి బీజేపీ పార్టీని వీడే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మోదీపై శ‌తృఘ్న ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. బీజేపీ పార్టీ మాత్రం మాజీ ఫిల్మ్‌స్టార్‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. 2009, 2014 సంవ‌త్స‌రాల్లో పాట్నా సాహిబ్ స్థానం నుంచే శ‌తృఘ్న గెలిచారు. ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీచేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles