ఆసక్తికర విషయాలు చెప్పిన ఫడ్నవిస్

Sun,December 8, 2019 06:53 PM


ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న అనంతరం ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అజిత్‌ పవార్‌ను సంప్రదించలేదు. తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఎన్‌సీపీ సిద్ధంగా ఉందని అజిత్‌ పవారే బీజేపీని సంప్రదించారని ఫడ్నవిస్ చెప్పారు. అజిత్ పవార్ కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడించారని, ఈ విషయం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా తెలుసన్నారు. శరద్ పవార్ ఆయనకు అనుకూలమైన విషయాలు ప్రజలకు చెప్పి..చాలా విషయాలు దాచిపెట్టారని ఆరోపించారు. సమయం వచ్చినపుడు ఆ విషయాలు ప్రజల ముందు పెడతామని ఫడ్నవిస్ చెప్పారు.

1501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles