లైంగిక వేధింపులు.. సీజేకు క్లీన్‌చిట్‌

Mon,May 6, 2019 05:21 PM

sex harassment charges against Chief Justice baseless, says top court panel

హైద‌రాబాద్‌: చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్‌పై వ‌చ్చిన లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఆ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ముగ్గురు స‌భ్యుల అంత‌ర్గ‌త క‌మిటీ తేల్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఒక‌రు సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దానిపై ఏర్పాటు అయిన క‌మిటీ.. ఇవాళ గ‌గోయ్‌కి అనుకూలంగా తీర్పునిచ్చింది. త్రిస‌భ్య క‌మిటీకి జ‌స్టిస్ బాబ్డే నేతృత్వం వ‌హించారు. జ‌స్టిస్ ఇందిరా బెన‌ర్జీ, జ‌స్టిస్ ఇందూ మ‌ల్హోత్రాలు స‌భ్యులుగా ఉన్నారు. అయితే తీర్పు అంశాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌మ‌ని న్యాయ‌మూర్తులు చెప్పారు. త్రిస‌భ్య ప్యానెల్ ముందు బుధ‌వారం సీజే విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అయితే ఈ క‌మిటీతో త‌న‌కు లాభం జ‌ర‌గ‌ద‌ని, అందుకే విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని ఫిర్యాదు చేసిన మ‌హిళ మంగ‌ళ‌వార‌మే పేర్కొన్న‌ది.

885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles