టికెట్లు ఇవ్వలేదని.. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు జంప్‌

Wed,March 20, 2019 10:45 AM

Setback for BJP in Northeast, Over 25 Leaders Quit After Denial of Tickets

ఇటానగర్‌: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈశాన్య భారత్‌లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వీరంతా మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా నాయ‌క‌త్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ)లో చేరారు. టికెట్లు కేటాయించే విషయంలో బీజేపీ కఠినంగా వ్యవహరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ జార్పం గామ్లిన్‌, హోంమంత్రి కుమార్‌ వైయి, పర్యాటకశాఖ మంత్రి జర్కార్‌ గామ్లిన్‌తో పాటు పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించింది. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఒకేసారి 54 మంది అభ్యర్థుల జాబితాను ఇటీవలే ప్రకటించింది. రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరగనున్నాయి. తప్పుడు హామీల వల్ల రాష్ట్ర ప్రజల్లో గతంలో బీజేపీకి ఉన్న విశ్వాసం ప్రస్తుతం లేదని కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో పోటీచేయడం మాత్రమే కాదు రాష్ట్రంలో ఎన్‌పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కుమార్‌ సవాల్‌ చేశారు.

ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌(పీపీఏ) ఎమ్మెల్యే, మరో 19 మంది కమలం పార్టీ నేతలు కూడా ఎన్‌పీపీలో చేరారు. ప్రస్తుతం మేఘాలయలో అధికారంలో ఉన్న ఎన్‌పీపీ.. బీజేపీ మద్దతుతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 40 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీ తరఫున బరిలో దించాలని ఎన్‌పీపీ నిర్ణయించింది.

3064
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles