వేలానికి మాల్యా విమానం

Thu,October 27, 2016 03:37 PM

Service tax dept to auction Mallyas aircraft

న్యూఢిల్లీ: 9 వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకుల‌ను ముంచిన కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ అధినేత‌, లిక‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాకు చెందిన ఆస్తులు ఒక్కొక్క‌టిగా వేలానికి వ‌స్తున్నాయి. తాజాగా స‌ర్వీస్ ట్యాక్స్ అధికారులు మాల్యా త‌మ‌కు బాకీ ప‌డిన రూ.535 కోట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు అత‌నికి చెందిన కార్పొరేట్ జెట్ ఎయిర్‌బ‌స్-319ను వ‌చ్చే నెల‌లో వేలం వేయ‌నుంది. ఈ డిపార్ట్‌మెంట్ ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో బిడ్స్‌ను ఆహ్వానించింది. ప్ర‌స్తుతం ముంబై ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఈ విమానాన్ని స‌ర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఏజెంట్ ఎంఎస్‌టీసీ న‌వంబ‌ర్ 28-29 తేదీల్లో వేలం వేయ‌నుంది. వేలంలో పాల్గొనే ఇండియ‌న్‌ బిడ్డ‌ర్స్ న‌వంబ‌ర్ 27లోగా రూ. కోటి జ‌మ చేయాల్సి ఉంటుంది. అదే విదేశీ బిడ్డ‌ర్స్ అయితే ల‌క్షా 52 వేల డాల‌ర్లు డిపాజిట్ చేయాలి. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్‌ను న‌డిపే స‌మ‌యంలో మాల్యా.. ప్ర‌యాణికుల నుంచి ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ స‌ర్వీస్ ట్యాక్స్ వ‌సూలు చేసినా.. దానిని డిపార్ట్‌మెంట్ ఖాతాలో జ‌మ చేయ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

1183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles