హోట‌ళ్ల‌లో స‌ర్వీస్ ఛార్జ్ త‌ప్ప‌నిస‌రి కాదుFri,April 21, 2017 06:01 PM
హోట‌ళ్ల‌లో స‌ర్వీస్ ఛార్జ్ త‌ప్ప‌నిస‌రి కాదు

న్యూఢిల్లీ: హోట‌ళ్లు, రెస్టారెంట్లు క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌సూల్ చేసే స‌ర్వీస్ ఛార్జ్‌పై కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మావ‌ళిని త‌యారు చేసింది. స‌ర్వీస్ ఛార్జ్ త‌ప్ప‌నిస‌రి అంశం కాద‌ని, అది వ్య‌క్త‌గ‌త‌మైన‌ద‌ని కేంద్ర మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ అన్నారు. క‌స్ట‌మ‌ర్లు ఎంత స‌ర్వీస్ ఛార్జ్ క‌ట్టాల‌న్న అంశాన్ని హోట‌ళ్లు, రెస్టారెంట్లు డిసైడ్ చేయ‌రాద‌ని, అది క‌స్ట‌మ‌ర్ విజ్ఞ‌త‌కు వ‌దిలి వేయాల‌ని మంత్రి అన్నారు. స‌ర్వీస్ ఛార్జ్ అంశంపై త‌యారు చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆయా రాష్ట్రాల‌కు పంపిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే ఆయా రాష్ట్రాలు త‌మ‌కు త‌గ్గ‌ట్టుగా కార్యాచ‌ర‌ణ తీసుకునే వీలు ఉంద‌న్నారు.

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS