షేకైన సెన్సెక్స్‌..

Thu,October 11, 2018 09:46 AM

sensex falls 900 points, rupee hits all time low

ముంబై : స్టాక్‌మార్కెట్లు ఇవాళ పేలవంగా మొదలయ్యాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 10 వేల 200 పాయింట్ల క‌న్నా త‌క్కువే ట్రేడ్ అవుతున్న‌ది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది. రూపాయి విలువ డాలర్‌తో 74.45గా రికార్డు అయ్యింది.

వాల్‌స్ట్రీట్ కుదేలు కావ‌డంతో.. ఆసియా మార్కెట్లు కూడా ఇవాళ బోరుమ‌న్నాయి. దాదాపు ఎనిమిది నెల‌ల త‌ర్వాత అమెరికా మార్కెట్లు ఖంగుతిన్నాయి. ఆ ప్ర‌భావం ఆసియా స్టాక్ మార్కెట్ల‌పై ప‌డింది. జ‌పాన్‌కు చెందిన నిక్కీ మార్కెట్ 3.2 శాతం ప‌డిపోయింది. మార్చి నెల త‌ర్వాత ట్రేడింగ్‌లో ఇంత దారుణంగా కుదేలు కావ‌డం ఇదే మొద‌టిసారి. ఫెడ‌ర‌ల్ బ్యాంక్ ప‌న్ను రేటు పెంచ‌డం వ‌ల్లే మార్కెట్లు ఇలా విల‌విల‌లాడుతున్నాయ‌ని డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

1521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles