సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య

Tue,September 5, 2017 10:15 PM

Senior journalist Gauri Lankesh shot dead

బెంగళూరు: సీనియర్ జర్నలిస్ట్, క్రీయాశీల కార్యకర్త గౌరి లంకేష్(55) తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో ఈ సాయంత్రం 8 గంటలకు చోటుచేసుకుంది. గౌరి లంకేశ్ పశ్చిమ బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లోని ఆమె సొంత ఇంటి వద్ద నిలబడి ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి ఆమెపై కాల్పులు జరిపినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఛాతీ, మెడ భాగంలో మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోయింది. కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు విచారణాధికారులు వెల్లడించారు. గౌరి 'లంకేశ్‌పత్రికే' అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్‌ను నడుపుతున్నది. పత్రికలో ఆమె స్వతంత్రంగా, నిర్భయంగా అభిప్రాయాలను వెలిబుచ్చేది. ఆమె సైద్ధాంతిక సిద్దాంతంతో విభేదించే వ్యక్తులే ఈ హత్య చేసిఉంటరని సమాచారం.

2872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles