ఆ బిల్లును స్థాయీ సంఘానికి పంపండి..

Thu,December 28, 2017 04:24 PM

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశి పెట్టిన తర్వాత దానిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలన్నారు. అక్కడ అన్ని పార్టీలకు చెందిన వారుంటారని, తమకు కొంత సమయం ఇవ్వాలని, బిల్లుపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని ఖర్గే తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అందరం మద్దతు తెలుపుతున్నామని, కానీ ఆ బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని స్టాండింగ్ కమిటీ ముందు పరిష్కారిస్తామని, నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ నేత ఖర్గే కోరారు. బిల్లుకు మద్దతు పలికిన కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి రవిశంకర్ థ్యాంక్స్ తెలిపారు. ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే వాటిని తమకు తెలియజేయాలని మంత్రి తెలిపారు. వీలైతే వాటిని బిల్లులో చేకూరుస్తామన్నారు.

1652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles