హత్య కేసులో దోషిగా తేలిన బాబా రాంపాల్

Thu,October 11, 2018 02:56 PM

Self styled godman Rampal found guilty in two murder cases

ఛండీగఢ్: సత్‌లోక్ ఆశ్రమం బాబా రాంపాల్ ఓ హత్య కేసుల్లో దోషిగా తేలాడు. నవంబర్ 2014లో హర్యానాలోని హిసార్‌లో గల బార్వాలా పోలీస్ స్టేషన్‌లో బాబా రాంపాల్‌పై రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఆశ్రమంలో ఓ మహిళ అనుమానాస్పదరీతిలో చనిపోయిన కేసు ఒకటికాగా.. కోర్టు దిక్కారణ కేసులో పోలీసులు రాంపార్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా చోటుచేసుకున్న ఘర్షణలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి మృతిచెందిన కేసు మరొకటి. రెండు హత్యకేసుల్లో బాబా రాంపాల్ దోషిగా తేలాడు. న్యాయస్థానం అక్టోబర్ 16 లేదా 17వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. అదేవిధంగా రాంపాల్‌తో పాటు అతడి అనుచరులపై దేశద్రోహం, హత్య వంటి ఐదు కేసులు హిసార్ కోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.

1247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS